శ్రీశైలం జలాశయాన్ని సందర్శించిన ఎన్‌డీఎస్‌ఏ బృందం
ABN , Publish Date - Apr 30 , 2025 | 12:03 AM
శ్రీశైలం జలాశయాన్ని మంగళవారం జాతీయ డ్యాం సేఫ్టీ అఽథారిటీ బృందం పరిశీలించింది.
శ్రీశైలం, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయాన్ని మంగళవారం జాతీయ డ్యాం సేఫ్టీ అఽథారిటీ బృందం పరిశీలించింది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్‌జైన్ నేతృత్వంలో డ్రిప్ ప్రాజెక్టు ప్రతినిధి నీతూ, సీడబ్ల్యూసీ డిప్యూటీ డైరక్టర్ ప్రభాత్‌కుమార్, సీడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్ రాకేశ్‌కశ్యప్, ఎన్‌డీఎస్‌ఏ రీజనల్ డైరక్టర్ గిరిధర్, ఈఎంసీ రత్నకుమార్‌లు స్థానిక జలాశయ ఇంజనీర్లతో కలసి శ్రీశైలం ఆనకట్ట భద్రతపై మూడు గంటల పాటు సమీక్ష నిర్వహించారు. పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా శ్రీశైలం ఆనకట్ట స్థితి గతులను వివరించారు. 2009 వరదల వల్ల శ్రీశైలం ఆనకట్ట కుడి, ఎడమ వైపు కొండచరియలు కొట్టుకుని పోవడంతో పాటు ప్లంజ్‌పూల్ పెరిగిన విషయాన్ని ఆనకట్ట ఇంజనీర్లు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందానికి వివరించారు. సాయంత్రం ఎన్‌డీఎస్‌ఏ బృందం ఆనకట్ట అప్రోచ్‌రోడ్, ప్లంజ్‌పూల్ ప్రాంతంతో పాటు, గ్యాలరీలోకి వెళ్లి బకెట్‌పోర్షన్, వాటరింగ్ సిస్టంను పరిశీలించారు. శ్రీశైలం ఆనకట్ట భద్రత, చేప ట్టాల్సిన మరమ్మతులను ఎన్‌డీఎస్‌ఏ బృందం కేంద్ర జలవ నరులశాఖ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఇంజనీర్లు తెలిపారు. ఈ పర్యటనలో శ్రీశైలం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ కబీర్ బాషా, ఎస్‌ఈ శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు.