Share News

క్రమశిక్షణకు మారుపేరు ఎన్‌సీసీ

ABN , Publish Date - Oct 28 , 2025 | 11:49 PM

క్రమశిక్షణకు మారుపేరు ఎన్‌సీసీ అని క్లస్టర్‌ యూనిర్సిటీ రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌ అన్నారు.

క్రమశిక్షణకు మారుపేరు ఎన్‌సీసీ
ఎన్‌సీసీ విద్యార్థులతో రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌

క్లస్టర్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌

కర్నూలు అర్బన్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): క్రమశిక్షణకు మారుపేరు ఎన్‌సీసీ అని క్లస్టర్‌ యూనిర్సిటీ రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం సిల్వర్‌ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్లస్టర్‌ యూనివర్సిటీలో విద్యార్థులకు 28వ ఆంధ్ర బెటాలియన్‌ లెప్టినెంట్‌ కల్నల్‌ ఎం. శివకుమార్‌ ఆధ్వర్యంలో క్యాడెట్ల ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్త్రార్‌ మాట్లాడుతూ ఎన్‌సీసీతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. విద్యార్థులకు రక్షణ రంగంలో పనిచేసే అవకాశం కలుగుతుందన్నారు. సుబేదార్‌ జక్తర్‌ సింగ్‌ మాట్లాడుతూ క్లస్టర్‌ వర్సిటీలో సిల్వర్‌ జూబ్లీ కళాశాల విద్యార్థులు ఎంతో కీర్తిని తెచ్చారని, దీన్ని కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ ప్రసాదరెడ్డి, ఎన్‌సీసీ ఆఫీసర్‌ శ్రీనివాసులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Oct 28 , 2025 | 11:49 PM