Share News

జిల్లాలో ప్రకృతి వ్యవ సాయ బృందం పర్యటన

ABN , Publish Date - Sep 24 , 2025 | 12:06 AM

రాష్ట్రంలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ విధానాలపై అవగాహన కోసం కర్నాటక రాష్ట్రానికి చెందిన వీఆర్‌టీటీఐ సంస్థ నుంచి నలుగురు సభ్యులు మంగళవారం నంద్యాల జిల్లాలో పర్యటించారు.

జిల్లాలో ప్రకృతి వ్యవ సాయ బృందం పర్యటన
పంటలను పరిశీలిస్తున్న వీఆర్‌ఐటీటీఐ బృందం

నంద్యాల హాస్పిటల్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ విధానాలపై అవగాహన కోసం కర్నాటక రాష్ట్రానికి చెందిన వీఆర్‌టీటీఐ సంస్థ నుంచి నలుగురు సభ్యులు మంగళవారం నంద్యాల జిల్లాలో పర్యటించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక స్థిరత్వం, స్వయం సమృద్ధి, జీవన ప్రమాణాల మెరుగుదల కోసం ఈ సంస్థ పనిచేస్తుంది. ఉపాధి అవకాశాలు, నైపుణ్య శిక్షణ, వ్యవసాయ ఆధారిత ప్రోత్సాహక చర్యలు, మార్కెట్‌ లింకేజీ అందిస్తూ యువత, మహిళలను బలోపేతం చేసి స్థిరమైన ఆదాయంతో జీవనవిధానం సాధించడానికి దోహదపడుతుందని ఏడీపీఎం అబ్దుల్‌సలాం అన్నారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి రైతులు అనుసరిస్తున్న వినూత్న పద్ధతులను తెలుసుకున్నారు. ప్యాపిలి మండలం బావిపల్లి, నేరేడుచర్ల యూనిట్లకు చెందిన ఐసీఆర్పీలు సాగు చేస్తున్న ఏటీఎం మోడళ్లను పరిశీలించారు. 1.20 ఎకరాల విస్తీర్ణంలో సాగుచేస్తున్న 18రకాల వైవిధ్య పంటల విధానాలను వారు అధ్యయం చేశారు. జలదుర్గం ప్రకృతి వ్యవసాయ యూనిట్‌ ఇన్‌చార్జి వెంకటప్ప అనుసరిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. వీఆర్‌ఐటీటీఐ బృంద సభ్యులు రాగిణి, రఘు, సందీప్‌, శరత్‌తోపాటు రైతుసాధికార సంస్థ సీనియర్‌ ప్రాజెక్టు మేనేజర్‌ జలాలుద్దీన్‌, ప్రకృతి వ్యవసాయ అదనపు ప్రాజెక్టు మేనేజర్‌ అబ్దుల్‌ సలాం, యూనిట్‌ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.

Updated Date - Sep 24 , 2025 | 12:06 AM