Share News

ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం

ABN , Publish Date - Nov 12 , 2025 | 12:31 AM

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం
అబుల్‌ కలాం ఆజాద్‌ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న అధ్యాపకులు

బనగానపల్లె, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతిని ప్రతి ఏటా జాతీయ విద్యాదినోత్సవం జరుపుకుంటున్నారు. ఈసందర్భంగా కళాశా లలో అధ్యాపకులు, విద్యార్థులు ఆజాద్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రిన్సిపాల్‌ లలిత, అధ్యాపకుడు బడేసాహెబ్‌లు మాట్లాడుతూ స్వాతంత్య్రం అనంతరం తొలి విద్యాశాఖామంత్రిగా సేవలందించారన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ లలిత, అధ్యాపకుడు బడేసాహెబ్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2025 | 12:31 AM