Share News

షెడ్యూల్డ్‌ కులాల ఉద్యోగులపె ౖజాతీయ కమిషన్‌ కార్యదర్శి సమీక్ష

ABN , Publish Date - May 13 , 2025 | 11:48 PM

శ్రీశైల మహాక్షేత్రంలో మంగళవారం షెడ్యూల్డ్‌ కులాల జాతీయ కమిషన్‌ కార్యదర్శి జి.శ్రీనివాస్‌ పర్యటించారు.

షెడ్యూల్డ్‌ కులాల ఉద్యోగులపె ౖజాతీయ కమిషన్‌ కార్యదర్శి సమీక్ష
అధికారులతో మాట్లాడుతున్న షెడ్యూల్డ్‌ కులాల జాతీయ కమిషన్‌ కార్యదర్శి జి.శ్రీనివాస్‌

శ్రీశైలం, మే 13(ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహాక్షేత్రంలో మంగళవారం షెడ్యూల్డ్‌ కులాల జాతీయ కమిషన్‌ కార్యదర్శి జి.శ్రీనివాస్‌ పర్యటించారు. నంద్యాల జిల్లాలో ఉద్యోగ నియామకాలు, పదోన్నతులు, షెడ్యూల్డ్‌ కులాల రిజర్వేషన్లు, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆయన సమీక్షించారు. ఆలయ ఈఓ ఎం. శ్రీనివాసరావు అధ్యక్షతన సమావేశ మందిరంలో ఈ సమీక్షా సమావేశం జరిగింది. శ్రీశైలక్షేత్ర ప్రత్యేకతను, భక్తులకు దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలను ఈఓ వివరించారు. 148 మంది షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన సిబ్బంది దేవస్థానంలో పనిచేస్తున్నాని, అందులో శాశ్వత ఉద్యోగులు 32 మంది, ఒప్పంద సిబ్బంది 50 మంది, పోరుగుసేవల సిబ్బంది 66 మంది ఉన్నట్లు తెలిపారు. అనంతరం షెడ్యూల్డ్‌ కులాల జాతీయ కమిషన్‌ కార్యదర్శి జి.శ్రీనివాస్‌ మాట్లాడుతూ దేవస్థానంలో ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో అమలుపరుస్తున్న రిజర్వేషన్‌ విధానాన్ని పరిశీలించారు. చారిత్రక శాసనాలు, తామ్రశాసనాలను, విశేషాలను భక్తులు చూసేందుకు ఓ మ్యూజియంను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. అనంతరం నంద్యాల జిల్లాలో షెడ్యూల్డ్‌ సామాజికవర్గాల అభివృద్ధికి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలపై జిల్లా అధికారులతో మాట్లాడారు. ఈ సమావేశంలో షెడ్యూల్డ్‌ కులాల జాతీయ కమిషన్‌ డైరెక్టర్‌ జి.సునీల్‌కుమార్‌ బాబు, నంద్యాల జేసీ సి.విష్ణుచరణ్‌, ఏఈవో డి.నాగజ్యోతి, జిల్లా సాంఘీక సంక్షేమ అధికారి యం.చింతామణి, దేవస్థానం యూనిట్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 13 , 2025 | 11:48 PM