నారా లోకేశ్ కృషి అభినందనీయం
ABN , Publish Date - Oct 14 , 2025 | 11:34 PM
అంతర్జాతీయంగా రాష్ట్ర ప్రతిష్టను నిలబెట్టి పెట్టుబడుల హబ్‌గా ఏపీని తీర్చిదిద్దడంలో మంత్రి నారా లోకేశ్ కృషి అభినందనీయమని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.
రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
బనగానపల్లె, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయంగా రాష్ట్ర ప్రతిష్టను నిలబెట్టి పెట్టుబడుల హబ్‌గా ఏపీని తీర్చిదిద్దడంలో మంత్రి నారా లోకేశ్ కృషి అభినందనీయమని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. మంగళ వారం ఆయన బనగానపల్లెలో విలేకరులతో మాట్లాడుతూ గూగుల్‌లో చారిత్రాత్మక ఒప్పందం చేసుకోవడంపై మంత్రి హర్షం వ్యక్తంచేశారు. సీఎం చంద్రబాబు మార్గదర్శ కత్వంలో యువనేత నారా లోకేశ్ కృషితో ఏపీకి గూగుల్ కంపెనీ తీసుకొచ్చార న్నారు. చంద్రబాబు, నారా లోకేశ్ ఆధ్వర్యంలో కేవలం 15 నెలల్లో రూ.7లక్షల కోట్లకుపైగా పెట్టుబడులకు ఆమోదం తెలపడం 6.2లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా అడుగులు పడడం రాష్ట్ర చరిత్రలోనే ఒక మైలు రాయి అన్నారు. సీఎం సుస్థిర పాలన ద్వారా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని గెలుచుకోగలుగుతు న్నామన్నారు. ప్రభుత్వం సుదీర్ఘ కాలం రాష్ట్రంలో కొనసాగడం ద్వారానే అన్నివర్గాల్లో మరింత నమ్మకం పెంపొందించుకోగలమన్నారు.