‘నందికొట్కూరు నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలో చేర్చాలి’
ABN , Publish Date - Aug 29 , 2025 | 12:23 AM
నందికొట్కూరు నియోజకవర్గాన్ని నంద్యాల జిల్లా నుంచి కర్నూలు జిల్లాలో చేర్చాలని సీపీఐ(ఎంఎల్)లిబరేషన్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఏఐఎస్‌ఏ జిల్లా కార్యదర్శి నాగార్జు డిమాండ్ చేశారు.
నందికొట్కూరు, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): నందికొట్కూరు నియోజకవర్గాన్ని నంద్యాల జిల్లా నుంచి కర్నూలు జిల్లాలో చేర్చాలని సీపీఐ(ఎంఎల్)లిబరేషన్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఏఐఎస్‌ఏ జిల్లా కార్యదర్శి నాగార్జు డిమాండ్ చేశారు. గురువారం సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, ఐసా ఆధ్వర్యంలో నంద్యాల వద్దు... కర్నూలు ముద్దు అంటూ పట్టణంలో ర్యాలీ, ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాడు నందికొట్కూరు ప్రజల అభిప్రాయాలను వైసీపీ ప్రభు త్వం పక్కనబెట్టి నంద్యాల జిల్లాలో చేర్చిందన్నారు. నాడు వైసీపీ నియోజకవర్గానికి చేసిన అన్యాన్ని నేడు కూటమి ప్రభుత్వం నంద్యాల నుంచి కర్నూలు జిల్లాలో నంది కొట్కూరును చేర్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశా రు. ప్రస్తుతం 340 జాతీయ రహదారి ఏర్పడడంతో కర్నూలుకు 24 కి.మీటర్ల దూరంలో నందికొట్కూరు ఉం దని, అలాంటిది 60 కి.మీటర్ల దూరంలో ఉన్న నం ద్యాలలో చేర్చడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రస్తు తం పరిపాలనా సౌలభ్యం కోసం, విద్యా- ఉపాధి అవ కాశాల కోసం నందికొట్కూరు నుంచి కర్నూలుకు అనుసంధానం చేయాల్సిన అత్యవసరం ఉందన్నారు. రైతు సంఘం తాలుకా అధ్యక్షుడు చెరుకుచర్ల గాబ్రి యేలు, ఏసన్న, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.