నాగేశ్వరమ్మకు కీర్తి చక్ర అవార్డు
ABN , Publish Date - Sep 28 , 2025 | 11:53 PM
మండలంలోని పెద్దబోదనం ఉన్నత పాఠశాలలో తెలుగు పండిట్‌గా విధులు నిర్వహిస్తున్న మారంరెడ్డి నాగేశ్వరమ్మ కవితలు రాయడంలో ప్రతిభ కనబరిచి కీర్తిచక్ర పురస్కారం అవార్డు అందుకున్నారు.
చాగలమర్రి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెద్దబోదనం ఉన్నత పాఠశాలలో తెలుగు పండిట్‌గా విధులు నిర్వహిస్తున్న మారంరెడ్డి నాగేశ్వరమ్మ కవితలు రాయడంలో ప్రతిభ కనబరిచి కీర్తిచక్ర పురస్కారం అవార్డు అందుకున్నారు. హైద రాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన కవితా పోటీల్లో పాల్గొని ప్ర తిభ కనబరిచారు. ఆమెకు జ్ఞాపిక, స్వర్ణకంకణం, బంగారు పతకం అలంకరించి సత్కరించారు. జనజాగృతి కళాసమితి ఆధ్వర్యంలో పోటీలను నిర్వహించినట్లు అవార్డు గ్రహీత పేర్కొన్నారు.