మైక్రో బయాలజీకి ఎన్‌ఏబీఎల్ గుర్తింపు
ABN , Publish Date - Sep 27 , 2025 | 12:09 AM
కేఎంసీ మైక్రోబయాలజీ విభాగం హెచ్‌ఐవీ ల్యాబ్‌కు ప్రతిష్టాత్మక ఎన్‌ఏబీఎల్ గుర్తింపు లభించింది.
కర్నూలు హాస్పిటల్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): కేఎంసీ మైక్రోబయాలజీ విభాగం హెచ్‌ఐవీ ల్యాబ్‌కు ప్రతిష్టాత్మక ఎన్‌ఏబీఎల్ గుర్తింపు లభించింది. శుక్రవారం ప్రిన్సిపాల్ డా.కే.చిట్టినరసమ్మ మైక్రోబయాలజీ హెచ్‌వోడీ డా.రేణుకాదేవిని అభినందంచారు. హెచ్‌వోడీ డా.రేణుకాదేవి మాట్లాడుతూ హెచ్‌ఐవీ పరీక్షలకు ఎన్‌ఏబీఎల్ మార్గదర్శకాల ప్రకారం అత్యంత ఖచ్చితత్వంతో పరీక్షలు నిర్వహించే వారికి ఈ గుర్తింపు లభిస్తుందన్నారు. ఎన్‌ఏబీఎల్ అక్రిడేషన్ ఐఎ్‌సవో 151822:2022 గుర్తింపు రావడం అంటే మైక్రోబయాలజీ పనితీరుకు నిదర్శనమన్నారు.