గడువులోగా పరిష్కరించాలి: కమిషనర్
ABN , Publish Date - May 27 , 2025 | 12:20 AM
ప్రజా సమస్యల పరి ష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరి ష్కరించాలని కార్పొరేషన కమిషనర్ ఎస్.రవీంద్రబాబు అధికారులను ఆదేశించారు.
కర్నూలు న్యూసిటీ, మే 26(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరి ష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరి ష్కరించాలని కార్పొరేషన కమిషనర్ ఎస్.రవీంద్రబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కార్పొరేషన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 21 అర్జీలు వచ్చాయి. మేనేజర్ చిన్నరాముడు, ప్రజారోగ్య అధికారి విశ్వేశ్వరరెడ్డి, సిటీ ప్లానర్ ప్రదీప్‌కుమార్, ఇనచార్జి ఎస్‌ఈ శేషసాయి, ఎంఈ సత్య నారాయణ, ఆర్‌ఓ జునైద్, శానిటేషన సూపర్‌వైజర్ నాగరాజు పాల్గొన్నారు.