చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి : సీఐ
ABN , Publish Date - Oct 22 , 2025 | 12:05 AM
విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని శిరివెళ్ల సర్కిల్ సీఐ దస్తగిరిబాబు అన్నారు.
శిరివెళ్ల, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని శిరివెళ్ల సర్కిల్ సీఐ దస్తగిరిబాబు అన్నారు. మండలంలోని యర్రగుంట్ల జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శక్తి యాప్, పోక్సో యాక్ట్, సైబర్ నేరాలు, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై సీఐ అవగాహన కల్పించారు. విద్యార్థులపై సెల్‌ఫోన, సోషల్ మీడియా ప్రభావంపై ఆయన వివరించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ చిన్న పీరయ్య, హెచఎం విజయ్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.