వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
ABN , Publish Date - Nov 09 , 2025 | 12:06 AM
ప్రభుత్వ ఉన్నత పాఠశా లలో చదివే పది విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా హెచ ఎంలు, ఉపాధ్యాయులు కృషి చేయాలి నంద్యాల డిప్యూటీ డీఈవో శంకరప్రసాద్ అన్నారు.
చాగలమర్రి, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉన్నత పాఠశా లలో చదివే పది విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా హెచ ఎంలు, ఉపాధ్యాయులు కృషి చేయాలి నంద్యాల డిప్యూటీ డీఈవో శంకరప్రసాద్ అన్నారు. శనివారం చాగలమర్రి బాలికోన్నత పాఠశా లను ఆయన తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. ఉపాధ్యా యిను లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సమ్మె టివ్ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలన్నారు. హెచఎం శివలక్ష్మీ, ఎంఈవోలు అనూరాధ, న్యామతుల్ల, వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.