ఏప్రిల్ నాటికి మున్సిపల్ భవనం పూర్తి
ABN , Publish Date - Oct 30 , 2025 | 11:42 PM
కర్నూలు నగర పాలక సంస్థ నూతన కార్యాలయాన్ని ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని అధికారులను పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఆదేశించారు.
పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
కర్నూలు న్యూసిటీ, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగర పాలక సంస్థ నూతన కార్యాలయాన్ని ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని అధికారులను పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. గురు వారం ఆయన నూతన కార్యాలయ నిర్మాణ పనులను కమిషనర్ పి.విశ్వ నాథ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ.28కోట్లతో నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని చేపడు తున్నా మన్నారు. ఇప్పటివరకు 50 శాతం పనులు పూర్తి అయ్యా యన్నారు. భవనం 3 అంతస్తులు ఉండగా, పూర్తి విస్తీర్ణం సుమారు 3.12 ఎకరాల్లో ఉంటుందన్నారు. పనుల్లో వేగవంతం ఉండేలా చర్యలు తీసుకుంటు న్నట్లు మంత్రి చెప్పారు. మంత్రి వెంట మేనేజర్ చిన్నరాముడు, ఇన్‌చార్జి ఎస్‌ఈ శేషసాయి, ఎంఈ మనోహర్‌రెడ్డి, డీఈఈ గిరిరాజు, టీఏఈ ఖాసింవలి, కార్పొరేటర్ పరమేష్ తదితరులు పాల్గొన్నారు.