Share News

ముంచిన మునగ

ABN , Publish Date - Apr 20 , 2025 | 12:18 AM

సాధారణ పంటలు నష్టం తెస్తుండటంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేశారు. కొంతకాలం వరకు లాభాలు తెచ్చిన ఈ పంటలు ఈ ఏడాది నష్టాన్ని తేవడంతో రైతులు అల్లాడుతున్నారు. మం డలంలోని 11 గ్రామాల్లో తోటలు, బావుల కింద దాదాపు 150 ఎకరాల్లో మునగ సాగుచేశారు. దిగుబడి ఆశాజనకంగా రావ డంతో ఇంకేముంది

ముంచిన మునగ
బొజ్జనాయనపేట గ్రామంలో సాగుచేసిన మునగ

దిగుబడి వచ్చినా, పడిపోయిన ధర

రైతుల ఆవేదన

మద్దికెర, ఏప్రిల్‌ 19 (ఆంధ్ర జ్యోతి): సాధారణ పంటలు నష్టం తెస్తుండటంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేశారు. కొంతకాలం వరకు లాభాలు తెచ్చిన ఈ పంటలు ఈ ఏడాది నష్టాన్ని తేవడంతో రైతులు అల్లాడుతున్నారు. మం డలంలోని 11 గ్రామాల్లో తోటలు, బావుల కింద దాదాపు 150 ఎకరాల్లో మునగ సాగుచేశారు. దిగుబడి ఆశాజనకంగా రావ డంతో ఇంకేముంది తమ కష్టాలు తీరుయతాయని రైతులు ఎంతో ఆనందపడ్డారు.

పడిపోయిన ధర

మునగ సాగుకు ఎకరాకు రూ.20వేల వరకు ఖర్చు చేశామని రైతులు అంటు న్నారు. దిగుబడి బాగా వచ్చింది. అయితే తీరా దిగుబడి వచ్చాక ధర అమాంతం పడిపోయింది. మొన్నటి వరకు రూ.10లకు 2 నుంచి 3 మునగకాయలు అమ్ముడు పోగా నేడు, 15 కాయలు అమ్ముతు న్నా ఎవరూ కొనడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆటోల్లో విక్రయం

మునగ సాగుచేసిన రైతులు వీటిని విక్రయించేందుకు ఆటోల్లో వేసుకుని పట్టణాలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. అయినా లాభం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముంచిన గాలివాన

ఏప్రిల్‌లో గాలివాన కురవడంతో కొన్ని మొక్కలు నేలకొరి గాయి. ఇన్ని రోజులు కాపాడు కున్న మొక్కలు నేలకొరగ డంతో రైతులు లబోదిబో మంటున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Apr 20 , 2025 | 12:18 AM