Share News

మదర్‌ థెరిస్సా సేవలు మరువలేనివి

ABN , Publish Date - Aug 27 , 2025 | 12:23 AM

దేశానికి మదర్‌ థెరిస్సా చేసిన సేవలు మరువలేనివని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ కొనియాడారు.

మదర్‌ థెరిస్సా సేవలు మరువలేనివి
మదర్‌ థెరిస్సా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పిస్తున్న రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ

రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ

కర్నూలు కల్చరల్‌, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): దేశానికి మదర్‌ థెరిస్సా చేసిన సేవలు మరువలేనివని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ కొనియాడారు. మదర్‌ ధెరిస్సా జయంతి సందర్భంగా మంగళవారం సంకల్‌బాగ్‌ దారిలోని కూడలిలో ఉన్న ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి ఆర్పించారు. ఈ సందర్భంగా ఆయన పిల్లలతో కేక్‌ కట్‌ చేయించారు. టీజీ వెంకటేశ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మదర్‌ థెరిస్సాను స్ఫూర్తిగా తీసుకొని ఇతరు లకు సాయంచేసి మానవత్వాన్ని చాటుకోవాలని సూచించా రు. అభయగిరిలో సేవా కార్యక్రమాల నిమిత్తం తమవంతు సహకారం అందజేస్తున్నట్లు టీజీ వెంకటేశ తెలిపారు. కార్యక్రమంలో శ్రీలక్ష్మి విద్యాసంస్థల డైరెక్టర్‌ దీక్షిత, సురేంద్ర, నృత్య గురువు రామకృష్ణ, అభయగిరి నిర్వాహకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Aug 27 , 2025 | 12:23 AM