Share News

తొలకరితో రైతు పులకింత

ABN , Publish Date - May 25 , 2025 | 11:54 PM

తొలకరి వర్షాలు మొదలు కావడంతో రైతులు పులకించిపోయారు. మండల కేంద్రంతోపాటు గ్రామాల్లో పత్తి, వేరుశనగ విత్తనాలు విత్తుతున్నారు.

తొలకరితో రైతు పులకింత
దేవనకొండలో విత్తనం వేస్తున్న కూలీలు

పత్తి, వేరుశన విత్తుతున్న రైతులు

జాగ్రత్తలు పాటించాలంటున్న వ్యవసాయధికారులు

దేవనకొండ, మే 25 (ఆంధ్రజ్యోతి): తొలకరి వర్షాలు మొదలు కావడంతో రైతులు పులకించిపోయారు. మండల కేంద్రంతోపాటు గ్రామాల్లో పత్తి, వేరుశనగ విత్తనాలు విత్తుతున్నారు. ఇప్పటికే పొలాలను దుక్కి, దున్ని పంట వేసేందుకు సిద్దం చేశారు. పది రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో రోహిణి కార్తెలోనే వాతావరణం చల్లబడటంతో విత్తనాలు వేస్తున్నట్లు రైతులు తెలిపారు.

జోరుగా పత్తి విత్తనాలు..

ఆస్పరి: మండలంలో ఎర్రనేల పొలాలు అధికంగా ఉన్న యాటకల్లు, కైరపల, తంగరడోణ, తురువగల్లు, బైలు పత్తికొండ, కలపరి, బిల్లేకల్‌, వలగొండ, ములుగుందం, కారుమంచి, డి.కోటకొండ గ్రామాల్లో పత్తి విత్తనాలు వేస్తున్నారు. మండలంలో సాధారణ పత్తి సాగు విస్తీర్ణం 15 ఎకరాల వరకు ఉంది.

ఆశతో పత్తి విత్తాం

ఈనెలలో విత్తితే అధిక దిగుబడి వస్తుందన్న నమ్మకంతో పత్తి విత్తనం వేస్తున్నాంజ 16 ఎకరాల్లో పత్తి సాగు చేయడానికి భూమిని చదును చేశాను. ప్రస్తుతం 8 ఎకరాల్లో విత్తనం వేశాను. - చాకలి ఈరన్న, కైరుప్పల రైతు

తేమ శాతాన్ని బట్టి విత్తనం వేయాలి

నేలలో 30 నుంచి 60 శాతం వరకు తేమ ఉన్నట్లయితే విత్తనం నాటు కోవాలి. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో డీలరు వద్ద నుంచి రసీదు తీసుకోవాలి. నాణ్యమె ౖనవే కొనాలి. సలహాలు, సూచనల కోసం వ్యవసాయ కార్యాలయంలో సంప్రదిం చండి. - నరేంద్రకుమార్‌, ఏవో, ఆస్పరి

ఆలూరు రూరల్‌: మండలంలోని అరికెర, అరికేర తండా, కరణి గూడ్డం, ముద్దనగేరి, హులేబీడు, ఆగ్రహారం, తుంబలబీడు, పెద్దహోత్తూరు గ్రామాల్లో రైతులు పత్తి, కంది, ఆముదం, విత్తనాలు విత్తుతున్నారు. ఈసారి వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు బాగా పండాలని ఆశిస్తున్నారు.

Updated Date - May 25 , 2025 | 11:55 PM