పైసా వసూల్
ABN , Publish Date - Dec 26 , 2025 | 11:37 PM
పైసా వసూల్
అవినీతికి అడ్డాగా తహసీల్దార్ కార్యాలయాలు
ప్రతి పనికో రేటు ఫిక్స్
అటకెక్కిన రెవెన్యూ పరిపాలన
సచివాలయాలను తనిఖీ చేయని అధికారులు
మండలంలో డిప్యూటీ తహసీల్దార్లే దిక్కు
నిద్రావస్థలో ఏసీబీ, విజిలెన్స్ అధికారులు
జిల్లాలో రెవెన్యూ పరిపాలన అటకెక్కింది. క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన రెవెన్యూ అధికారులు పైసలిస్తేనే ఫైళ్లను చక్కబెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రతి పనికి ఓ రేటును ఫిక్స్ చేసుకున్నారు. రైతులు ముడుపులు చెల్లిస్తేనే పనులు చేస్తున్నారు. జిల్లాలో అత్యధిక స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రెవెన్యూ, రీసర్వే అర్జీలను జిల్లా అధికారులు స్వీకరిస్తున్నారు. ఆ అర్జీలను ఆసరా చేసుకుని రైతులను మండల తహసీల్దార్ కార్యాలయం చుట్టూ నెలల నుంచి సంవత్సరాల వరకు తిప్పు కుంటున్నారు. రైతులు తమ పనులను వదులుకోలేక మండల తహసీల్దార్లకు ముడుపులు సమర్పించుకుంటున్నారు.
కర్నూలు కలెక్టరేట్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ కార్యాలయాల్లో ప్రతి పని పైసలు వసూలు చేస్తున్నారు. మండలంలో పని చేసే వీఆర్వోలు పైసా వసూల్ బాధ్యతను తీసుకుని తహసీల్దార్లకు ముట్టచెబుతున్నారు. తహసీల్దార్లు మండలంలోని ఏ గ్రామంలో కూడా సచివాలయాలను తనిఖీలు చేసిన దాఖలులేవు. నెలల తరబడి అర్జీలు పరిష్కారం కాకపో వడంతో మండల రెవెన్యూ అధికారులే ఏదో ఒక కారణం చూపు తూ ఆఅర్జీని క్లోజ్ చేస్తున్నారు. వీఆర్వోలు, సర్వేయర్లు ఉదయం 10నుంచి మధ్యా హ్నం 2గంటల వరకు కూడా సచివాలయంలో ఉండడం లేదని ప్రజలు వ్యక్తం చేస్తు న్నారు. తహసీల్దార్ ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మండల కార్యా లయంలో ఉంటున్నారు. మండల తహసీల్దార్‌కు కలెక్టరేట్ నుంచి వచ్చిన అర్జీలను కూడా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడం లేదన్న విమర్శలున్నాయి.
తప్పులు చేసినా
తహసీల్దార్లు తప్పులు చేసినా రెవెన్యూ ఉన్నతాధికారులు వారిని ప్రశ్నించకపోవడం గమనార్హం. ఓ తహసీల్దార్ షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తికి షెడ్యూల్డ్ తీగల సర్టిఫి కెట్ ఇచ్చారు. రెవెన్యూ అధికారులు దీనిపై విచారణ చేపట్టారు. విచారణలో తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చాడని రుజువైంది. కానీ ఆ తహసీల్దార్, డీటీ, ఆర్‌ఐ, వీఆర్వోలపై చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. కర్నూలు నగరంలోని గణేష్‌నగర్‌కు చెందిన వ్యక్తి నకిలీ ధ్రువపత్రాలతో కారుణ్య నియామకం పొందాడని, దాన్ని రద్దు చేయాలంటూ ఓ సంఘం నాయకుడు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి జిల్లాలో సీపీటీ, సర్వే పరీక్ష ఉత్తీర్ణత కానీ 11మంది అనధికార ఆర్‌ఐలుగా కొనసాగుతున్నారు. ఇంత వరకు వారిని తొలగించలేదు. మండలంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంతమంది తహసీల్దార్లను సరెండర్ చేస్తున్నారు. మరలా కొన్ని రోజుల్లో వారిని తహసీల్దార్‌గా నియమిస్తున్నారు.
డీటీలే దిక్కు
మండలంలోని తహసీల్దార్లు లేకపోవడంతో డిప్యూటీ తహసీల్దార్లే దిక్కయ్యారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 22 మండలాలకు తహసీల్దార్లు లేరు. రాయలసీమ జోన్‌లో దాదాపు 100 మంది తహసీల్దార్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
20వ తేదీ వరకు పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన అర్జీలు..
అర్జీలు రెవెన్యూ విభాగం రీసర్వే విభాగం
మొత్తం అర్జీలు 21,070 20,501
పరిశీలనలో ఉన్నవి 557 2,495
పురోగతిలో ఉన్నవి 327 1,607
పరిష్కరించబడినవి 19,521 16,727
పెండింగ్‌లో ఉన్నవి 230 900..