ప్రభుత్వ లాంఛనాలతో మొహర్రం
ABN , Publish Date - Jun 27 , 2025 | 12:05 AM
పట్టణంలో ప్రభుత్వ లాంఛనాలతో ఈ ఏడాది మొహర్రం వేడుకలు నిర్వహించనున్నట్ల ఆర్ అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలి పారు. గురువారం రాత్రి పట్టణంలోని ఆస్థానం పీర్ల వద్ద మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, నవాబు వారుసుడు మీర్ ఫజిల్ అలీఖాన్, షియా ముస్లింలతో కలసి ప్రార్థనలు చేశారు
రూ.10 లక్షల నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
బనగాన పల్లె, జూన్ 26(ఆంధ్రజ్యోతి): పట్టణంలో ప్రభుత్వ లాంఛనాలతో ఈ ఏడాది మొహర్రం వేడుకలు నిర్వహించనున్నట్ల ఆర్ అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలి పారు. గురువారం రాత్రి పట్టణంలోని ఆస్థానం పీర్ల వద్ద మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, నవాబు వారుసుడు మీర్ ఫజిల్ అలీఖాన్, షియా ముస్లింలతో కలసి ప్రార్థనలు చేశారు. మతగు రువులతో పాటు షియా ముస్లింలు బీసీకి ఘన స్వాగతం పలికారు. మొహర్రం సందర్భంగా మంత్రి బీసీ ప్రత్యేక చొరవతీసుకొని సీఎం చంద్ర బాబు, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ సహకారంతో మొహర్రం వేడుకలు నిర్వహించ డానికి రూ.10లక్షలు నిధులు కేటాయించార న్నారు. వీరికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఆస్థానం పీర్లను మంత్రి బీసీ సందర్శించారు. ఆస్థానం బంగారు పీర్లవద్ద మంత్రి బీసీ ప్రత్యేక ఫాతేహాలు చేశారు. మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముస్లిం, మైనార్టీలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.తొలిసారి బనగానపల్లెలో మొహర్రం వేడుకలకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయించా మన్నారు. ముంబై తర్వాత బనగానపల్లెలోనే ఈ వేడుకలు భారీగా నిర్వహిస్తారన్నారు. ప్రజలు కులమతాలకతీతంగా ఈవేడుకలు సంతోషంగా జరుపుకోవాలని మంత్రి కోరారు. మొహర్రం వేడుకలు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. నవాబు వారసుడు మీర్ ఫజిల్ అలీఖాన్ మాట్లాడుతూ తొలిసారిగా ప్రభుత్వం రూ.10లక్షలు నిధులు కేటాయించి నందుకు సీఎం చంద్రబాబునాయుడు, మైనార్టీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌కు, మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.