మోదీ పర్యటనను జయప్రదం చేయాలి
ABN , Publish Date - Oct 15 , 2025 | 12:10 AM
ఉమ్మడి కర్నూలు జిల్లాలో గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను జయప్రదం చేయాలని ప్రధాని పర్యటన కమిటీ కన్వీనర్, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన రావు పిలుపునిచ్చారు.
ప్రధాని పర్యటన కమిటీ కన్వీనర్ దామచర్ల జనార్దన రావు
డోన టౌన, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు జిల్లాలో గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను జయప్రదం చేయాలని ప్రధాని పర్యటన కమిటీ కన్వీనర్, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన రావు పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశరెడ్డి, డోన నియోజకవర్గ అబ్జర్వర్ కేసీ హరితో కలిసి ఆయన డోన నియోజకవర్గ కూటమి నాయకులు, క్లస్టర్, బూత ఇనచార్జిలతో కలిసి సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డోన నియోజకవర్గం లోని బేతంచెర్ల, డోన, ప్యాపిలి మండలాల నుంచి దాదాపు 200 పైగా బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ఈ బస్సుల్లో 10వేల మందికి పైగా కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని క్లస్టర్ ఇనచార్జిలను ఆదేశించారు. ప్రధాని రాకతో ఉమ్మడి జిల్లాకు భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈసమా వేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, టీడీపీ పట్టణ అధ్య క్షుడు టీఈ రాఘవేంద్రగౌడు, మండల అధ్యక్షుడు దశరథరామిరెడ్డి, ప్యాపిలి మండల అధ్యక్షుడు సుదర్శన, ప్యాపిలి పట్టణ అధ్యక్షుడు బొమ్మనపల్లె మధు, బేతంచెర్ల మండల అధ్యక్షులు ఎల్ల నాగయ్య, పట్టణ అధ్యక్షురాలు బుగ్గన ప్రసన్నలక్ష్మి, చండ్రపల్లె లక్ష్మీనారాయణ యాదవ్, బీజేపీ నాయకుడు సంధు వెంకటరమణ, బండి కిరణ్, రవి, దిలీప్ రెడ్డి, తోట మనోహర్, ఎంపీడీవో జి.వెంకటేశ్వరరెడ్డి, ఏపీవో సుకుర్ పాల్గొన్నారు.