హిస్టెరోస్కోపీలో ఆధునిక పద్ధతులు
ABN , Publish Date - Nov 02 , 2025 | 11:43 PM
నగరంలోని జోహరాపురం రోడ్డు అశ్వినీ హాస్పిటల్‌లో గైనకాలజీ వైద్యులకు హిస్టోరోస్కోనీలో శిక్షణ ఇచ్చారు.
కర్నూలు హాస్పిటల్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): నగరంలోని జోహరాపురం రోడ్డు అశ్వినీ హాస్పిటల్‌లో గైనకాలజీ వైద్యులకు హిస్టోరోస్కోనీలో శిక్షణ ఇచ్చారు. పూణేకు చెందిన డా.వినాయక్ మహాజన్ ఆధునిక పరికరాలతో, సురక్షమైన శస్త్ర చికిత్స పద్దతులను వివరించారు. గైనిక్ హెచ్‌వోడీ డా.బి.ప్రమీల మాట్లాడుతూ మహిళల ఆరోగ్య సంరక్షణలో ఆధునిక శస్త్రచికిత్సలను యువ గైనకాలజిస్టులకు నేర్పించడం అవసరమన్నారు. డా.బిటీ సీత, డా.వెంకటరమణ, డా.రాధారాణి, అనస్తీషియా ప్రొఫెసర్ డా.రామశివ నాయక్ పాల్గొన్నారు.