ఆధునిక పద్ధతులు పాటించాలి: ఏడీఏ
ABN , Publish Date - Dec 04 , 2025 | 12:31 AM
వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు పాటించాలని ఏడీఏ సునీత రైతులకు సూచించారు.
డోన రూరల్, డిసెంబరు 3(ఆంధ్రజోతి): వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు పాటించాలని ఏడీఏ సునీత రైతులకు సూచించారు. ‘రైతన్న మీ కోసం’ కార్యక్రమాన్ని మండలంలో 9 రోజులు విజయవంతంగా నిర్వహిం చిన సందర్భంగా కొచ్చెర్వు గ్రామ సచివాలయంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలో రైతులు వేసిన పంటలు పాడి, ఆధారిత వ్యవస్థలపై సుధీర్గంగా సమీక్షించారు. కార్యక్రమంలో యాగంటి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రమణయ్య, సుధా కర్, పాలరాజు, ఏఈ బిన్ని రాజు, రైతు సేవా కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.