జిల్లాలో మోస్తరు వర్షాలు
ABN , Publish Date - Sep 26 , 2025 | 11:17 PM
జిల్లాలోని అనేక మండలాల్లో శుక్రవారం మోస్తరు వర్షాలు కురిశాయి.
పగిడ్యాలలో అత్యధికంగా 36.4మి.మీ..
నంద్యాలలో అత్యల్పంగా 1.0మి.మీ వర్షపాతం
నంద్యాల ఎడ్యుకేషన్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అనేక మండలాల్లో శుక్రవారం మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా పగిడ్యాల మండలంలో 36.4 మి.మీ వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా నంద్యాల మండలంలో 1.0మి.మీ వర్షపాతం నమోదైంది. జూపా డుబంగ్లా 26.8, కొత్తపల్లె 26.8, శ్రీశైలం 23.4, నందికొట్కూరు 18.4, ఆత్మకూరు 18.4, పాములపాడు 11.0, మిడ్తూరు 10.4, కోవెలకుంట్ల 5.4, బండిఆత్మకూరు 5.0, డోన్ 4.8, వెలుగోడు 3.8, చాగలమర్రి 2.2, దొర్నిపాడు 2.0మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో..
ఉమ్మడి జిల్లాలో నేడు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికలకేంద్రం జారీచేసింది. వర్షాలతో పాటు నైరుతి దిశగా గంటకు 20 కిలోమీటర్ల నుంచి 30 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశముందన్నారు. గాలిలో తేమశాతం ఉదయం 78 నుంచి 85శాతం, మధ్యాహ్నం 57 నుంచి 77శాతం నమోదయ్యే అవకాశముందని వెల్లడించారు.