Share News

మోడల్‌ స్కూళ్ల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

ABN , Publish Date - May 03 , 2025 | 12:30 AM

: ఏపీ మోడల్‌ స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశానికి నిర్వహించిన పరీక్షలో 1733 మంది విద్యార్థులు అర్హత మార్కులు సాధించారు.

మోడల్‌ స్కూళ్ల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

67 శాతం అర్హత సాధించిన విద్యార్థులు

ఉమ్మడి జిల్లాల్లో 93 మార్కులతో టాపర్‌గా నిలిచిన షేక్‌ షఫీ

నంద్యాల ఎడ్యుకేషన్‌, మే 2 (ఆంధ్రజ్యోతి): ఏపీ మోడల్‌ స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశానికి నిర్వహించిన పరీక్షలో 1733 మంది విద్యార్థులు అర్హత మార్కులు సాధించారు. 2948 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా 2586 మంది పరీక్షకు హాజరయ్యారు. అందులో 67శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. నంద్యాల పట్టణం బొమ్మలసత్రం మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న షేక్‌ షఫీ, షేక్‌ హసీనాల కుమారుడు షేక్‌ సరోజ్‌ 100కి 93 మార్కులు సాధించి ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల టాపర్‌గా నిలిచి నంద్యాల చాపిరేవుల మోడల్‌ స్కూల్‌కు ఎంపికయ్యాడు.

Updated Date - May 03 , 2025 | 12:30 AM