Share News

శ్రీశైలంలో మాక్‌ డ్రిల్‌

ABN , Publish Date - Aug 29 , 2025 | 11:35 PM

శ్రీశైలం క్షేత్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ఆక్టోపస్‌ బృందం మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు.

శ్రీశైలంలో మాక్‌ డ్రిల్‌
మాట్లాడుతున్న ఈవో శ్రీనివాసరావు

నంద్యాల కల్చరల్‌, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం క్షేత్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ఆక్టోపస్‌ బృందం మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. శుక్రవారం క్యూకాంప్లెక్స్‌, క్యూలైన్ల నిర్వహణ, భద్రతా పరంగా చేపట్టవలసిన పలుచర్యలపై ఆలయ ఈవో శ్రీనివాసరావు ఆక్టోపస్‌ బృందంతో సమావేశం నిర్వహించారు. భక్తుల భద్రతకు సంబంధించిన అంశాలు, క్యూలైన్ల నిర్వహణ, ఉత్సవాల్లో దర్శనం చేసుకుంటున్న భక్తుల సంఖ్య తదితర అంశాలపై డీఎస్పీ సుంకురయ్య, సీఐ ప్రసాదరావు, దేవస్ధానం భద్రతా విభాగం పర్యవేక్షకులు మల్లికార్జున తదితరులు పాల్గొని చర్చించారు.

Updated Date - Aug 29 , 2025 | 11:35 PM