అహోబిలేశుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే
ABN , Publish Date - Nov 09 , 2025 | 11:54 PM
మండలంలోని ఎగువ, దిగువ అహోబిలం క్షేత్రాలను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆదివా రం దర్శించుకున్నారు.
ఆళ్లగడ్డ, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎగువ, దిగువ అహోబిలం క్షేత్రాలను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆదివా రం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ప్రధాన అర్చకుడు కీడాంబి వేణుగోపాల్ స్వామి, వేదపండితులు ఆమెకు ఆలయ మర్యా దలతో స్వాగతం పలికారు. అనంతరం ప్రహ్లాదవరదస్వామి వారికి అష్టోత్తర శతనామార్చన, అమృతవల్లి అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వ హించారు. అనంతరం రంగనాయక మంటపంలో అర్చ కులు అమెకు వేద ఆశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.
రామతీర్థంలో ఎమ్మెల్యే పూజలు: రామతీర్థం క్షేత్రాన్ని ఎమ్మెల్యే భూ మా అఖిలప్రియ దర్శించుకున్నారు. సుబ్రమణ్వేర స్వామివారి పుట్టకు ఆమె పూజలు చేశారు. దేవస్థానం ఈవో సాయి జయచంద్రరెడ్డి, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.