Share News

ఎమ్మెల్యే విరుపాక్షి దాతృత్వం

ABN , Publish Date - Sep 11 , 2025 | 12:02 AM

మం డలంలోని చిగిలి గ్రామంలో ఆగస్టు 20న చిన్నారులను కోల్పోయిన బాధిత తల్లిదండ్రులకు ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి ఆర్థిక సాయం చేశారు.

ఎమ్మెల్యే విరుపాక్షి దాతృత్వం
బాధిత కుంటుంబాలకు నగదు అందజేస్తున్న ఎమ్మెల్యే విరుపాక్షి

చిగిలి బాధితులకు కుటుంబానికి

రూ.50 వేల చొప్పున సాయం

ఆస్పరి, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): మం డలంలోని చిగిలి గ్రామంలో ఆగస్టు 20న చిన్నారులను కోల్పోయిన బాధిత తల్లిదండ్రులకు ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి ఆర్థిక సాయం చేశారు. బుధవారం బాధితులను పరామర్శించి, ఒక్కో కుటుం బానికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద కుటుం బాలను ఆదుకోవడం వైసీపీకే చెందుతుందన్నారు. బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యిందన్నారు. బాధిత కుంటుబాలను ఆదుకోవాలని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని తెలిపారు. బసవరాజు, గోవర్ధన్‌, రామాంజనేయులు, మహానంది, సర్పంచులు రాధాకృష్ణ, హరికృష్ణ, ప్రకాష్‌, తిమ్మప్ప పాల్గొన్నారు.

Updated Date - Sep 11 , 2025 | 12:02 AM