Share News

గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

ABN , Publish Date - Dec 15 , 2025 | 11:57 PM

పట్టణంలోని పడకండ్ల సమీపంలో ఉన్న గురుకుల బాలికల విద్యాలయాన్ని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సోమవారం తనిఖీ చేశారు.

గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే
విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తున్న ఎమ్మెల్యే అఖిలప్రియ

ఆళ్లగడ్డ, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పడకండ్ల సమీపంలో ఉన్న గురుకుల బాలికల విద్యాలయాన్ని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భోజనశాల, హస్టల్‌ పరిసరాలను పరిశీలించారు. వంటశాల పక్కన మురుగు కాలువ నీరు పోక దుర్గంధం వెదజల్లుతుండడంతో వెంటనే శుభ్రం చేయించాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. అలాగే హాస్టల్‌ పరిసరాలు ముళ్లకంపలు, పిచ్చిమొక్కలతో నిండిపోవడంతో జంగిల్‌ క్లియరెన్స చేయించాలని ఎంపీడీవో నూర్జహానకు సూచించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి ఆమె భోజనం చేశారు. పాఠశాలలో వసతులు ఎలా ఉన్నాయని వారిని అడిగి తెలుసుకొన్నారు. ప్రిన్సిపాల్‌ ఫిర్‌దోష్‌ అంజుం, మంత్రి నారాలోకేశ టీం సభ్యులు ఉన్నారు.

Updated Date - Dec 15 , 2025 | 11:57 PM