ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు: మంత్రి
ABN , Publish Date - Jul 02 , 2025 | 01:02 AM
నగరంలో అర్హులం దరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి టీజీ భరత తెలిపారు.
కర్నూలు అర్బన, జూలైౖ 1(ఆంధ్రజ్యోతి): నగరంలో అర్హులం దరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి టీజీ భరత తెలిపారు. మంగళవారం నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో జాయింట్ కలెక్టర్ బి.నవ్య, ఆర్డీవో సందీప్, కర్నూలు, అర్బన, కల్లూరు తహసీల్దార్లు వెంకట రమేష్, రవి, ఆంజనేయులుతో సమీక్షించారు. టీజీ భరత మాట్లా డుతూ మంగళగిరిలో మంత్రి నారా లోకేశ ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని అఽధికారులకు సూచించారన్నారు. నగరంలోని పంప్‌హౌస్ సమీపం లోని ఉన్న గూడేం కొట్టాల ప్రజలకు ఇళ్ల పట్టాలు అందిస్తామని యువగళం పాదయాత్రలో లోకేశ ఇచ్చిన హామీ మేరకు పట్టాలు ఇచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో ఇళ్ల పట్టాలిచ్చిన వారికి స్థలాలు లేవని, చాలా మంది తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. ఏబీసీ క్యాంప్‌ల ప్రభుత్వ గృహసముదాయాల్లో శిథిలావస్థకు చేరిన ఇళ్లను పూర్తిగా తొలగించి, ఆ స్థలాలను ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమా లకు వినియోగించుకోవాలని ఆదేశించారు.