నేడు జిల్లాకు మంత్రి నిమ్మల
ABN , Publish Date - Jun 10 , 2025 | 11:55 PM
జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం జిల్లాకు రానున్నారు.

కర్నూలు, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం జిల్లాకు రానున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి 7:25 గంటలకు విజయవాడ నుంచి రైలు మార్గాన బయల్దేరుతారు. బుధవారం తెల్లవారుజామున 3:03 గంటలకు డోన్ చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి 4 గంటలకు కర్నూలు లోని రోడ్లు, భవనాలు శాఖ అతిఽథిగృహానికి చేరుకుంటారు. రూ.22 కోట్లతో నిర్మించిన కె.నాగులాపురం-నన్నూరు రోడ్డును తడకనపల్లెలో ప్రారంభిస్తారు. అక్కడ జరిగే సమావేశంలో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు డోన్ చేరుకుని అక్కడి నుంచి రైలులో విజయవాడకు బయలుదేరుతారు.