మల్లన్న సన్నిధిలో మంత్రి బాల వీరాంజనేయస్వామి
ABN , Publish Date - Oct 27 , 2025 | 11:57 PM
: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను సాంఘిక, సంక్షేమశాఖ మంత్రి బాలవీరాంజనేయ స్వామి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
శ్రీశైలం, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను సాంఘిక, సంక్షేమశాఖ మంత్రి బాలవీరాంజనేయ స్వామి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. సోమవారం తెల్లవా రుజామున ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న వీరికి ఈవో శ్రీని వాసరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అమ్మవారి ప్రాకార మండపంలో వేదపండితులు వేదాశీర్వచనాలు వల్లించి తీర్థప్రసాదాలతో పాటు పరిమళ విభూది, శేషవస్త్రాలు, జ్ఞాపికను అందజేశారు.