Share News

అర్ధరాత్రి హైడ్రామా

ABN , Publish Date - Dec 30 , 2025 | 01:14 AM

పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత హైడ్రామా నెలకొంది. చాగి, నారాయణపురం, ఢణాపురం, చిన్నహరివాణం, గణ్ణేకల్లుతోపాటు 11గ్రామాలను కర్ణాటక వద్ద ఉన్న పెద్దహరివాణంలో కలపడంతో చిన్నహరివాణంకు చెందిన గోనేహళ్‌ గోపాల్‌రెడ్డి అంబేడ్కర్‌ కూడలి వద్ద ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు.

అర్ధరాత్రి హైడ్రామా
దీక్ష శిబిరం వద్ద పోలీసులతో వాగ్వాదం చేస్తున్న ప్రజలు

ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు

అడ్డుకున్న 16 గ్రామాల ప్రజలు

పోలీసుల లాఠీచార్జి

ప్రైవేట్‌ ఆసుపత్రిలో గోపాల్‌ రెడ్డి దీక్ష కొనసాగింపు

ఆదోని రూరల్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత హైడ్రామా నెలకొంది. చాగి, నారాయణపురం, ఢణాపురం, చిన్నహరివాణం, గణ్ణేకల్లుతోపాటు 11గ్రామాలను కర్ణాటక వద్ద ఉన్న పెద్దహరివాణంలో కలపడంతో చిన్నహరివాణంకు చెందిన గోనేహళ్‌ గోపాల్‌రెడ్డి అంబేడ్కర్‌ కూడలి వద్ద ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. అప్పటికే బీపీ పెరిగి షుగర్‌ లెవల్‌ తగ్గుతుండడంతో డాక్టర్ల సూచనల మేరకు డీఎస్పీ హేమలత ఆధ్వర్యంలో అర్ధరాత్రి 12గంటల తరువాత పోలీసు బలగం అక్కడికి చేరుకొని గోపాల్‌రెడ్డి దీక్షను విరమింపచేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో 16గ్రామాల ప్రజలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాఠీ చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు దీక్షను భగ్నం చేసి గోపాల్‌రెడ్డిని ప్రత్యేక అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయించారు. మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు వెళ్లాలని వైద్యులు చెప్పడంతోఆదోనిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో దీక్ష కొనసాగింపు

గోపాల్‌రెడ్డిని పోలీసులు పట్టణంలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ప్రభుత్వం దిగి వచ్చి తమ 16 గ్రామాలను ఆదోని మండలంలోనే కొనసాగిస్తామని ప్రకటించేంతవరకు దీక్ష విరమించబోనని గోపాల్‌రెడ్డి తెలిపారు. దీంతో పోలీసులు ఆసుపత్రి బయట బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Dec 30 , 2025 | 01:14 AM