Share News

ఎంఈవో, హెచ్‌ఎం పోస్టుల భర్తీ

ABN , Publish Date - Jul 27 , 2025 | 12:27 AM

ఉమ్మడి జిల్లాల్లో మండల విద్యాశాఖాధికా రుల పోస్టులను భర్తీ చేస్తూ ఆర్జేడీ శ్యామ్యూల్‌ ఉత్తర్వులు జారీచేశారు

ఎంఈవో, హెచ్‌ఎం పోస్టుల భర్తీ

నంద్యాల ఎడ్యుకేషన్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాల్లో మండల విద్యాశాఖాధికా రుల పోస్టులను భర్తీ చేస్తూ ఆర్జేడీ శ్యామ్యూల్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఎంఈవోలుగా కొనసాగుతూ ఇటీవల రిటైర్‌ అయిన వారి స్థానా లతో పాటు ఒకరికి రెండు పదవులు లేకుండా పూర్తిస్థాయిలో ఎంఈవో పోస్టులను గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యా యులతో భర్తీ చేశారు. కర్నూలు జిల్లా కృష్ణగిరి ఎంఈవో-2గా పనిచేస్తున్న మద్దయ్య గత నెలలో రిటైర్డ్‌ కాగా ఆ స్థానంలో కోయిలకొండలో జడ్పీ పాఠశాల హెచ్‌ఎం మైఖేల్‌ను నియమిం చారు. కొలిమిగుండ్ల ఎంఈవో-1గా, ఎఫ్‌ఏసీపై సంజామల ఎంఈవో-1గా పనిచేస్తున్న రాజయ్య ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో బనగానపల్లె ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం రామకృష్ణయ్యను కొలిమిగుండ్ల ఎంఈవోగా-1 గా, సంజామల ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం రమణారెడ్డిని సంజా మల ఎంఈవో-1గా నియమించారు. పగిడ్యాల ఎంఈవో-1గా, నందికొట్కూరు ఎంఈవో-1 ఎఫ్‌ఏసీగా పనిచేస్తున్న సుభాన్‌ను నందికొట్కూరు ఎఫ్‌ఏసీని తప్పించి నందికొట్కూరు ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం రామిరెడ్డిని ఎంఈవో-1 గా నియమించారు. కొత్తపల్లె మండల ఎంఈవోగా ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం నాగరాజును, సున్నిపెంట ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం మేరీ మార్గరేట్‌ను ఆత్మకూరు ఎంఈవో-1గా, తిమ్మాపురం పాఠశాల హెచ్‌ఎం విజయకుమార్‌ను మహానంది ఎంఈవో-2గా, ఏనుగుల మర్రి జడ్పీ పాఠశాల హెచ్‌ఎం రఘునాయక్‌ను డోన్‌ ఎంఈవో-2గా నియమించారు.

ఎస్‌ఏలతో హెచ్‌ఎం పోస్టుల భర్తీ

ఉమ్మడి జిల్లాల్లో ఖాళీగా ఉన్న పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టులను స్కూల్‌ అసిస్టెంట్‌లతో భర్తీ చేశారు. ఆళ్లగడ్డ ప్రభుత్వ పాఠశాల గణితం ఉపాధ్యాయులు శేషశయనా రెడ్డిని అదే పాఠశాల హెచ్‌ఎంగా నియమించారు. గడిగరేవుల పాఠశాల హెచ్‌ఎంగా చంద్రావతి, తిమ్మాపురం జడ్పీ పాఠశాల హెచ్‌ఎంగా చంద్రశేఖర్‌రెడ్డి, సంజామల ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎంగా షబ్బీర్‌ హుస్సేన్‌, ఆత్మకూరు జడ్పీ ఉర్దూ హైస్కూల్‌ హెచ్‌ఎంగా మోహన్‌బాబు, ఆత్మకూరు జడ్పీ హైస్కూల్‌ హెచ్‌ఎంగా దేవనాథన్‌ నియమితులయ్యారు. అలాగే నందికొట్కూరు ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎంగా సిద్ధయ్య, కలమందలపాడు జడ్పీ హైస్కూల్‌ హెచ్‌ఎంగా రమేష్‌కుమార్‌, సున్నిపెంట ప్రభుత్వ ప్రాజెక్టు హైస్కూల్‌ హెచ్‌ఎంగా పద్మావతి, బనగానపల్లె ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎంగా శ్రీనివాసులు, ఏనుగుమర్రి జడ్పీ హైస్కూల్‌ హెచ్‌ఎంగా రాజశేఖర్‌ను నియమించారు.

Updated Date - Jul 27 , 2025 | 12:27 AM