వృద్ధుల్లో మానసిక స్థైర్యాన్ని నింపాలి
ABN , Publish Date - Jun 16 , 2025 | 12:57 AM
వృద్ధులపట్ల ప్రేమ, గౌరవం, ఆదరణ చూపిస్తూ వారిలో మానసిక స్థైర్యాన్ని నింపాలని మూ డో అదనపు జిల్లా న్యాయాధికారి, మండల లీగల్‌సెల్ చైర్మన అమ్మన్న రాజా అన్నారు.

నంద్యాల క్రైం, జూన 15 (ఆంధ్రజ్యోతి): వృద్ధులపట్ల ప్రేమ, గౌరవం, ఆదరణ చూపిస్తూ వారిలో మానసిక స్థైర్యాన్ని నింపాలని మూ డో అదనపు జిల్లా న్యాయాధికారి, మండల లీగల్‌సెల్ చైర్మన అమ్మన్న రాజా అన్నారు. ప్రపంచ వృద్ధుల దౌర్జన్య నివారణ అవగాహన దినోత్స వం సందర్భంగా ఆదివారం రైతునగర్‌లోని ప్రతిభా వృద్ధుల అనాథా శ్రమాన్ని న్యాయాధికారి అమ్మన్నరాజా సందర్శించారు. వృద్ధాశ్రమంలోని వృద్ధుల వివరాలు, ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమ పరిసరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ వృద్ధుల పట్ల నిర్లక్ష్యం వీడాలని, వారిని శారీరక వేధింపులకు గురి చేయరాదన్నారు. ఆస్తి, డబ్బు అపహరణ కాకుండా కాపాడుకు నేందుకు చట్టాలు ఉన్నాయని చెప్పారు. వృద్ధుల అవసరాలను తీర్చడం లో నిర్లక్ష్యం చేయకూడదన్నారు. సమస్యలుంటే మండల లీగల్‌సెల్ ద్వారా ఉచితంగా న్యాయాన్ని అందజేస్తామని వృద్ధులకు సూచించారు. కార్యక్రమంలో మండల లీగల్‌సెల్ న్యాయవాది మద్దిలేటి, వృద్ధాశ్రమ నిర్వాహకుడు నారాయణ, వార్డెన లక్ష్మీదేవి, లోక్‌అదాలత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.