యోగాతో మానసిక ప్రశాంతత
ABN , Publish Date - Jun 14 , 2025 | 11:57 PM
యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని డ్వామా పీడీ రమణయ్య అన్నారు.
డ్వామా పీడీ రమణయ్య
ఓర్వకల్లు, జూన 14 (ఆంధ్రజ్యోతి): యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని డ్వామా పీడీ రమణయ్య అన్నారు. యోగా మహోత్సవాల్లో భాగంగా ఓర్వకల్లులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో యోగా కార్యక్రమా న్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డ్వామా పీడీ వెంకటరమణయ్య హాజర య్యారు. పొదుపులక్ష్మి మహిళలకు, వివిధ శాఖ అధికారులతో యోగా అభ్యాసకుడు నాగరాజు ఆసనాలు చేయించారు. ఎంపీడీవో శ్రీనివాసులు, ఏపీఎం వెంకట్రామిరెడ్డి గ్రామ పెద్దలు గోవిందరెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, భాస్కర్ రెడ్డి, ఏసేపు, పంచాయతీ కార్యదర్శి నాగరాజు పాల్గొన్నారు.
కర్నూలు న్యూసిటీ: యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని కార్పొరేషన మేనేజర్ చిన్నరాముడు అన్నారు. శనివారం ఆయన బుధవారపేటలోని 30వ సచివాలయ పరిధిలో యోగా దినోత్సవం కోసం సన్నాహక సామూహిక ప్రదర్శనలో పాల్గొని యోగాసనాలు వేశారు. చిన్నరాముడు మాట్లాడుతూ ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినో త్సవం పురస్కరించుకుని యోగాతో కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తున్నామన్నారు. ఈ నెల 17న ఔట్ డోర్ స్టేడియంలో 5 వేల మంది పారిశుధ్య కార్మికులతో యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మేనేజర్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఐ రాజు, శిక్షకులు పాల్గొన్నారు.
కల్లూరు: ప్రతిరోజూ యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సాధ్యపడుతుందని జడ్పీ సీఈఓ నాసరరెడ్డి అన్నా రు. శనివారం కల్లూరు మండలం పర్ల జిల్లా పరిషత పాఠశాల ప్రాం గంణంలో ఏర్పాటు చేసిన యోగా మహోత్సవానికి ఆయన ముఖ్య అతిఽథిగా హాజరై మాట్లాడారు. సెట్కూరు సీఈఓ, మండల స్పెషల్ అధికారి కె.వేణుగోపాల్, ఎంపీడీఓ జి.నాగశేషాచలరెడ్డి, సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
కోడుమూరు రూరల్: మనిషి దైనందిన జీవితంలో యోగా భాగం కావాలని ప్రత్యేకాధికారి ఉస్మాన అన్నారు. ఈ నెల 21న అం తర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని శనివారం మండలంలోని ఎర్రదొడ్డి గ్రామంలో అభ్యాసకులు యోగా ఆసనాలు చేశారు. ఉస్మాన మాట్లాడు తూ యోగాతో బీపీ, షుగర్, నొప్పులు వంటి రుగ్మతలను అదుపు చేయ వచ్చునని అన్నారు. మాస్టర్ ట్రైనర్స్ ఆసనాలు చేయించారు. కార్యక్రమం లో టీడీపీ నాయకులు చిల్లబండ బాషా,మాస్టర్ ట్రైనర్ శివ పాల్గొన్నారు.