Share News

మెగా డీఎస్సీని వెంటనే విడుదల చేయాలి

ABN , Publish Date - Apr 11 , 2025 | 12:14 AM

మెగా డీఎస్సీని వెంటనే విడుదల చేయాలని డీవైఎ్‌ఫఐ జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.

మెగా డీఎస్సీని వెంటనే విడుదల చేయాలి
స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌కు వినతి పత్రంఇస్తున్న విద్యార్థి సంఘం నాయకులు

డీవైఎ్‌ఫఐ ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయం ముట్టడి

కర్నూలు ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీని వెంటనే విడుదల చేయాలని డీవైఎ్‌ఫఐ జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. డీవైఎ్‌ఫఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు బిర్లా కాంపౌండు నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు భారీగా ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎ్‌ఫఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి హోదాలో మొదటి సంతకం పెట్టి డీఎస్సీ విడుదల చేయడంలో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. పది నెలలు గడిచినా మొదటి సంతకాన్ని అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. మెగా డీఎస్సీని సీఎం చంద్రబాబు నాయుడు త్వరలోనే మెగా డీఎస్సీని విడుదల చేస్తామని తరచూ ప్రకటనలు చేస్తూ నిరుద్యోగులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. వెంటనే మెగా డీఎస్సీ విడుదల చేయాలంటూ జిల్లా మొత్తం అభ్యర్థులందరికీ ఒకే పేపరు ఉండేలా పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో డీవైఎ్‌ఫఐ రాష్ట్ర కార్యదర్శి శిరీష, జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర, జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్లా, సహాయ కార్యదర్శి నిరుద్యోగుల నాయకులు చంద్రశేఖర్‌, వినయ్‌, జగన్మోహన్‌, 500 మంది డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 12:14 AM