Share News

మెగా కాంప్లెక్స్‌ పనులు ప్రారంభం

ABN , Publish Date - Sep 05 , 2025 | 12:56 AM

పట్టణంలోని పాత బస్టాండ్‌లో 14 నెలలుగా ఆగిపోయిన మున్సిపల్‌ మెగా కాంప్లెక్స్‌ పనులు ఎట్టకేలకు గురువారం ప్రారంభమయ్యాయి. ఈనెల 1వ తేదీన ఆంధ్రజ్యోతి దినప త్రికలో ‘ప్రజాధనం తుప్పు పడుతోంది’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఇందుకు స్పందించిన ప్రభుత్వం, అధికా రులు పనులను వెంటనే ప్రారంభించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించడంతో గురువారం పనులను ప్రారంభించారు.

మెగా కాంప్లెక్స్‌ పనులు ప్రారంభం
పిల్లర్ల కడ్డీలను శుభ్రం చేస్తున్న కార్మికులు, సెల్లార్‌లో బురదను తొలగిస్తున్న ఎక్స్‌కవేటర్‌

వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వ ఉత్తర్వులు

హర్షం వ్యక్తం చేస్తున్న దుకాణదారులు

ఆదోని టౌన్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పాత బస్టాండ్‌లో 14 నెలలుగా ఆగిపోయిన మున్సిపల్‌ మెగా కాంప్లెక్స్‌ పనులు ఎట్టకేలకు గురువారం ప్రారంభమయ్యాయి. ఈనెల 1వ తేదీన ఆంధ్రజ్యోతి దినప త్రికలో ‘ప్రజాధనం తుప్పు పడుతోంది’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఇందుకు స్పందించిన ప్రభుత్వం, అధికా రులు పనులను వెంటనే ప్రారంభించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించడంతో గురువారం పనులను ప్రారంభించారు.

కాగా 2023లో అగ్రిమెంట్‌ కాగా, 2024 మార్చిలో కాంప్లెక్స్‌ నిర్మాణానికి నాటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ.33 కోట్ల వ్యాపారుల గుడ్‌విల్‌ డబ్బుతో 386 దుకాణాలు ఉండేలా మెగా కాంప్లెక్స్‌ ప్లాన్‌ను రూపొందిం చారు. అయితే పనులు హఠాత్తుగా నిలిచిపోవడంతో వేలంలో షాపులను దక్కించుకొన్న దుకాణదారులు తలలు పట్టుకొన్నారు. 25 శాతం కన్నా తక్కువగా చేసిన అన్ని పనులు ఆపివేయాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు పనులు ఆగిపోయాయి. కాగా పనులు ప్రారంభించడంతో వేలంలో దక్కించుకున్న దుకాణదారులు హర్షం చేస్తున్నారు.

కడ్డీల సామర్థ్యం పరిశీలన

పనులు ఆగిపోయి చాలా కాలయం అవడంతో నాడుి పిల్లర్లకు వాడిన ఇసుప కడ్డీల సామర్థ్యాన్ని జైయన్‌టీయూ (అనంతపురం)లో పరిశీలన కోసం పంపనున్నట్లు మునిసిపల్‌ ఇంజనీర్‌ సత్యనారాయణ తెలిపారు. నివేదిక రాగానే పనులను వేగవంతం చేస్తామన్నారు.

Updated Date - Sep 05 , 2025 | 12:56 AM