30 ఏళ్ల తరువాత కలిశారు
ABN , Publish Date - Dec 24 , 2025 | 12:24 AM
శ్రీశైలం గురుకుల పాఠశాల(బీసీ) 1994-95 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు మంగళవారం కలిశారు. నగరంలోని నందికొట్కూరు రోడ్డు కేవీఆర్ గార్డెన్‌లో పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, జిల్లాలకు చెందిన పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు.
కర్నూలు ఎడ్యుకేషన్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం గురుకుల పాఠశాల(బీసీ) 1994-95 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు మంగళవారం కలిశారు. నగరంలోని నందికొట్కూరు రోడ్డు కేవీఆర్ గార్డెన్‌లో పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, జిల్లాలకు చెందిన పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. విద్యార్థులు ఉపాధ్యాయులకు సాంప్రదాయ వాయిధ్యాలతో స్వాగతం పలికారు. పదవీ విరమణ పొందిన ప్రిన్సిపాల్ అనుసూయమ్మ, దామోదరం, దేవదానం, రామ్మూర్తి, ఎస్‌ఎం బాషా, విజయలక్ష్మి, పీవీ రమణ, చెంగం నాయుడు, నారాయణస్వామి ఉపాధ్యాయులను సన్మానించారు. అనంతరం తాము చదువుకున్న పాఠశాలకు రూ.70వేల విలువైన పుస్తకాలు, స్పోర్ట్స్ కిట్స్, పదో తరగతిలో అత్యదిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతలు ఇస్తామని కే.లక్ష్మణాచారి, బి.శివనాగరాజు, వి.నారాయణ, వడ్డె మారెన్న ప్రకటించారు. నిర్వాహకులు నాగశేషులు, సీఎల్ నరసింహులు, విజయ్, అరుణ, శ్రీరాములు, 108 శ్రీను, బాలరాజు, వంశీ, నరసింహులు, కృష్ణానాయక్, మాధవకృష్ణ, రవీంద్ర, నాగార్జున పాల్గొన్నారు.