Share News

వేగంగా వైద్య కళాశాల పనులు

ABN , Publish Date - Sep 18 , 2025 | 11:59 PM

ఆదోని, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): పట్టణ శివార్లలోని ఆరేకల్‌ వద్ద ఉన్న ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ పనులు ఊపందుకున్నాయని కూటమి నాయకులు తెలిపారు. గురువారం కళాశాలను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. పునాదుల్లో నిలిచిన మోకాళ్ల లోతు నీటిలో నిరసన తెలిపారు.

వేగంగా వైద్య కళాశాల పనులు
మోకాళ్లలోతు నీటిలో నాయకులు

కళాశాలను సందర్శించిన కూటమి నాయకులు

ఆదోని, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): పట్టణ శివార్లలోని ఆరేకల్‌ వద్ద ఉన్న ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ పనులు ఊపందుకున్నాయని కూటమి నాయకులు తెలిపారు. గురువారం కళాశాలను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. పునాదుల్లో నిలిచిన మోకాళ్ల లోతు నీటిలో నిరసన తెలిపారు. అనంతరం టీడీపీ నాయకుడు భూపాల్‌చౌదరి మాట్లాడుతూ ప్రజలపై భారం మోపకుండా పీపీపీ పద్ధతిలో నిర్మించి, పేద విద్యార్థులకే అధిక సీట్లు కేటాయిస్తారనాఆ్నరు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పనులు ఆగిపోయాయని, కూటమి ప్రభుత్వం బాధ్యతగా మళ్లీ ప్రాంభించిందన్నారు. రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించడమే తమ లక్ష్యమని, వైసీపీ నాయకులు రాజకీయ ప్రయోజనానికే ప్రైవీటీకరణ అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. జనసేన ఇన్‌చార్జి మల్లప్ప మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రూ.5 వేల కోట్లకు రుణం తీసుకుని పనులు చేయలేదన్నారు. బీజేపీ నాయకుడు విట్టా రమేష్‌ మాట్లాడుతూ పనులు 20 శాతం మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు. మారుతినాయుడు, వెంకటేష్‌చౌదరి, తిమ్మప్ప, బసాపురం రామస్వామి, ప్రతాపరెడ్డి, సాధికాబేగం పాల్గొన్నారు.

Updated Date - Sep 18 , 2025 | 11:59 PM