Share News

ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి చర్యలు

ABN , Publish Date - Aug 15 , 2025 | 12:46 AM

నగరంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అధికారులను ఆదేశించారు.

ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి చర్యలు
అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి టీజీ భరత

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి భరత

అధికారులతో సమీక్ష

కర్నూలు అర్బన, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): నగరంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అధికారులను ఆదేశించారు. గురువారం నగరంలోని ప్రభుత్వ అతిథి గృహం లో ఎస్పీ విక్రాంత పాటిల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ పి.విశ్వనాథ్‌, డిఎస్పీ బాబు ప్రసాద్‌, డీటీసీ శాంతకుమారి, ట్రాఫిక్‌ సీఐతోపాటు నగరంలోని సీఐలతో మంత్రి సమీక్ష నిర్వహించారు. టీజీ భరత మాట్లాడుతూ నగరం లో రోజు రోజుకు ట్రాఫిక్‌ సమస్య తీవ్రతరం అవుతుందన్నారు. పాతబస్తిలో వనవే పెట్టడంతోపాటు వన సైడ్‌ పార్కింగ్‌ పెట్టాలని పోలీసులు సూచిం చారు. ఆటోల లైన ప్రత్యేకంగా పెట్టాల్సి ఉంటుందని, ఇందుకోసం అవస రమైతే మార్కింగ్‌ ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ఇక ప్రధాన రోడ్లలో తోపుడు బండ్లతో ట్రాఫిక్‌ ఇబ్బంది కలగకుండా వారికి కేటాయించిన ప్రాంతాల్లోనే అమ్ముకునేలా మున్సిపల్‌, పోలీసులు సమన్వయంతో పని చేయాలన్నారు. రెడ్‌ జోన లిస్టును పోలీసు శాఖకు అందించి ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు చెప్పారు. ఆర్టీసీ బస్సులను నగరంలో నుంచి కాకుండా ఊరి బయట వెళ్లేందుకు ప్రణాళిక తయారు చేయాలని ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీనివాసులకు సూచించారు. అన్ని బస్సులు బయలు ఒకేసారి బయటకు రాకుండా కొన్నిం టిని నగరంలో నుంచి వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ మాటా డుతూ మద్యం దుకా ణాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది కలగ కుం డా చూడాలని, మద్యం తాగి వాహనాలు నడి పే వారిపై చర్యలు తీసుకోవా లని అన్నారు. అవసరమైన అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పెట్టాలన్నారు.

Updated Date - Aug 15 , 2025 | 12:46 AM