తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు
ABN , Publish Date - Aug 05 , 2025 | 11:45 PM
జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రంజిత్‌బాషా పేర్కొ న్నారు.
కలెక్టర్ రంజిత్ బాషా
కాల్వ గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణ పనులు ప్రారంభం
ఓర్వకల్లు, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రంజిత్‌బాషా పేర్కొ న్నారు. మంగళవారం మండలంలోని కాల్వ గ్రామంలో నూతనంగా ఏర్పా టు చేయనున్న ఓవర్‌హెడ్ స్టోరేజీ ట్యాంకుల పనులను పాణ్యం ఎమ్మె ల్యే గౌరు చరితారెడ్డి, టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్‌తో కలిసి కలెక్టర్ భూమి పూజచేసి ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ గ్రామాల్లో జడ్పీ, మండల పరిషత్, పంచాయతీ నిధులను విని యోగించి తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నా మన్నారు. గ్రామాల్లో జల్‌జీవన్ మిషన్ నిధుల కింద రూ.1.12కోట్లతో 90వేల లీటర్ల సామర్థ్యం గల మరో 40లీటర్ల సామర్థ్యం గల ఓవర్‌హెడ్ ట్యాంకులను నిర్మిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడు తూ సీఎం చంద్రబాబు ప్రజల సంక్షేమానికి, జిల్లాల అభివృద్ధికి నిరం తరం కృషి చేస్తున్నారన్నారు. కలెక్టర్, ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు గ్రామంలో ఉన్న కోనేటి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బ్రిటీష్ కాలంలో నిర్మించిన కోనేరులో నీటిని నింపి అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కోనేరును పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. జడ్పీ సీఈవో నాసరరెడ్డి, డ్వామా పీడీ వెంకట రమణయ్య, కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, త హసీల్దార్ విద్యాసాగర్, ఎంపీడీవో శ్రీని వాసులు, సర్పంచ్ పెద్ద వెంకటే శ్వర్లు, ఆర్‌డబ్లూఎస్ డీఈ అమల, ఏఈ శ్రీనివాసులు, ఎస్‌ఐ సునీల్ క ుమార్, టీడీపీ నాయకులు బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, గోవిందరెడ్డి, మోహన్‌రెడ్డి, మహబూబ్‌బాషా, చంద్రపెద్దస్వామి, కేవీ మధు, ఖాదర్‌బాషా పాల్గొన్నారు.