గిరిజనుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు
ABN , Publish Date - Aug 09 , 2025 | 11:59 PM
: గిరిజనుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రాజ కుమారి పేర్కొన్నారు.
జీవనోపాఽధి మెరుగుపరచాలి
కలెక్టర్ రాజకుమారి
చిన్నారుల గిరిజన సంప్రదాయ నృత్యాలు
నంద్యాల ఎడ్యుకేషన్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): గిరిజనుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రాజ కుమారి పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శని వారం నంద్యాల కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో ఐటీడీఏ పీవో వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో గిరిజన బాలికల కోసం 13 ఆశ్రమ పాఠశాలలు 9 గిరిజన వసతి గృహాలను నిర్వహిస్తున్నారన్నారు. గిరిజనులు చెడు వ్యసనాలకు లోను కాకుండా వారి జీవనోపాధి మెరుగుపరచాల్సిన అవసరం ఉందని అన్నారు. చెంచుగూడేల్లోని తల్లిదండ్రులు తమపిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. చెంచెగూడేల్లోని పీవీటీజీలకు ఇళ్ల నిర్మా ణాల కోసం కేంద్రప్రభుత్వం ద్వారా రూ.1.80లక్షలు, రాష్ట్రప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. పీఎం జన్‌మన్ పథకం ద్వారా 600 ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. గిరిజన సంఘాల నాయ కులు కూడా ముందుకు వచ్చి ఇండ్ల నిర్మాణాలను వేగవం తంగా చేసేలా చూడాలని గిరిజన సంఘాల నాయకులను కోరారు. గిరిజన వేషాధారణలో చిన్నారులు చేసిన నృత్యాలు ప్రతి ఒక్కరినీ అలరిం చాయి. ఆదివాసీల అభ్యున్నతికి పాటుపడిన గిరిజన సంఘాల నాయ కులను కలెక్టర్ శాలువా, జ్ఞాపికతో సత్కరించారు.