శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు
ABN , Publish Date - Sep 15 , 2025 | 12:24 AM
శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు.
బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ సునీల్ షెరాన్
నంద్యాల టౌన్ సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు. నంద్యాల ఎస్పీగా ఆదివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. పట్టణంలోని జిల్లా పోలీ సు కార్యాలయంలో సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించి అనంతరం వేద పండితుల మధ్య ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా నుంచి బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలు పోలీసుల వద్దకు వస్తే న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కల్పిస్తామన్నారు. పోలీసులు కూడా ప్రజలతో సక్యతగా మెలగాలని అన్నారు. జిల్లాలో ఎక్కడా కూడా అసాం ఘిక కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని, లేని పక్షంలో వారిపై చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు. అనంతరం జిల్లా యంత్రాంగం పుష్ప గుచ్చాలతో స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎ స్పీలు యుగంధర్‌బాబు, జావళి, ఆత్మకూరు, ఆళ్లగడ్డ డీఎస్పీలు రామాం జి నాయక్, ప్రమోద్‌కుమార్, సీఐలు, ఎస్‌ఐలు సిబ్బంది పాల్గొన్నారు.