శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు: ఎస్పీ
ABN , Publish Date - Mar 12 , 2025 | 12:24 AM
జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆలూరు పోలీసు స్టేషన్‌ను ఆయన సందర్శించారు.

ఆలూరు, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆలూరు పోలీసు స్టేషన్‌ను ఆయన సందర్శించారు. స్టేషన్‌లో నెలకొన్న సమస్యలను సీఐ వెంకట చలపతి, ఎస్‌ఐ దిలీప్ కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఆలూరు సబ్ జైలు 15 ఏళ్లుగా మరమ్మతుల పేరిట మూతపడిందని విలేక రులు ప్రస్తావించగా, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఎస్పీ చెప్పారు.
సైబర్ నేరాలతో అప్రమత్తంగా ఉండాలి
హొళగుంద: సైబర్ నేరాలతో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. హొళగుంద పోలీస్ స్టేషన్, మార్లమాడికి చెకపోస్ట్‌ను పరిశీలించారు. అనంతరం రికార్డులు పరిశీలించారు.
విచారించి కేసులు నమోదు చేస్తాం
జర్నలిస్టులపై కొందరు ఉద్దేశపూర్వకంగా అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఎస్పీ విక్రాంత్ పాటిల్ దృష్టికి తీసుకువెళ్లారు. విచారణ చేసి కేసులు నమోదుచేస్తామని, నిజాయితీగల వ్యక్తులపై అక్రమ కేసులు నమోదు చేస్తే ఆ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేసామని ఎస్పీ చెప్పారు. ఆలూరు సీఐ వెంకటచలపతి, ఎస్‌ఐ బాల నరసింహులు, స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ అక్బరుద్దీన్ పాల్గొన్నారు.