Share News

గణిత మేధావి శ్రీనివాస రామానుజన్‌

ABN , Publish Date - Dec 23 , 2025 | 01:28 AM

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గణిత మేధావి రామనుజన్‌ అని రెక్టార్‌ ప్రొఫెసర్‌ ఎన్‌ టీకే నాయక్‌ అన్నారు. సోమవారం రాయలసీమ యూనివర్సీటీలో రామానుజన్‌ 138వ జయంతి నిర్వహించారు

గణిత మేధావి శ్రీనివాస రామానుజన్‌
ఆర్‌యూలో నివాళి అర్పిస్తున్న ప్రొఫెసర్లు

కర్నూలు అర్బన్‌ , డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గణిత మేధావి రామనుజన్‌ అని రెక్టార్‌ ప్రొఫెసర్‌ ఎన్‌ టీకే నాయక్‌ అన్నారు. సోమవారం రాయలసీమ యూనివర్సీటీలో రామానుజన్‌ 138వ జయంతి నిర్వహించారు. శ్రీనివాస రామానుజన్‌ పరిఽశోధనలు సమాజ పురోభివృద్దికి సహకరిస్తాయని తెలిపారు. రిజిష్ట్రార్‌ బోయ విజయకుమార్‌ నాయుడు, ప్రిన్సిపాల్‌ విశ్వనాథరెడ్డి, ఆధ్యాపకులు సునీత, వీరకృష్ణ, నాగిరెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు.

సిల్వర్‌ జూబ్లీ డిగ్రీ కళాశాలలో విశ్రాంత ప్రిన్సిపాల్‌ డా. దేవీకా రాణి, ప్రిన్సిపాల్‌ జి.శ్రీనివాస్‌ ఽఅద్యక్షతన నివాళి అర్పించారు. పరీక్షల విభాగం డీన్‌ నాగరాజశేట్టి, గణిత విభాగం అధ్యక్షుడు నాగ సురేష్‌, డా. శ్రీనివాసరెడ్డి, ఎల్లా కృష్ణ, ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌ డా. విమలా రోధే, నాగ అరుణ, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.

కేవీఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ వెంకటరెడ్డి అధ్యక్షతన విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. అధ్యాపకులు పావని, సునీత, వాసవి, వీనీల, పద్మావతి, విద్యార్థినులు పాల్గొన్నారు.

ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ ఇందిరా శాంతి ఆధ్వర్యంలో నిర్వహించారు. గణిత శాస్త్ర విభాగాధిపతి ఎం కృష్ణారెడ్డి, వైస్‌ ప్రిన్సిపల్‌ జె. హేమంత్‌, అధ్యాపకులు సత్యనారాయణ, కామల్లి నాయక్‌, దివాకర్‌ పాల్గొన్నారు

ఓర్వకల్లు: జడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్‌ జయంతి నిర్వహించారు. హెచ్‌ఎం రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రతిభకు పేదరికం అడ్డుకాదని, గణితంలో రామానుజం రూపొందించిన సిద్దాంతాలను వివరించారు. ఉపాధ్యాయులు నాగన్న, శ్రీనివాసులు, సుదర్శన్‌ రెడ్డి, వెంకట శేషయ్య, తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు స్పోర్ట్స్‌: నగరంలోని కేశవరెడ్డి పాఠశాలల్లో సోమవారం మ్యాథ్స్‌డే నిర్వహించారు. పాఠశాలల వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్‌.కేశవరెడ్డి మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్‌ ప్రపంచ ప్రఖ్యాతి గాంచడం హర్షణీయమన్నారు. ఏజీఎం లలిత, ప్రధానోపాద్యాయురాలు జైశ్రీ, రాణి, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

వెంకటాద్రినగర్‌ శ్రీ చైతన్య పాఠశాలలో వేడుకలు నిర్వహించారు. గణిత ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. ఆర్‌ఐ రామాంజనేయులు, ప్రిన్సిపాల్‌ మాదవి, డీన్‌ మురళి, శ్రావణి, రామయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2025 | 01:28 AM