Share News

మార్కులు, ర్యాంకులు ప్రకటించాలి: డీటీఎఫ్‌

ABN , Publish Date - Aug 30 , 2025 | 01:03 AM

డీఎస్సీ-2025లో ఎంపికైన అభ్యర్థుల మార్కులు, ర్యాంకులు ప్రకటించాలని జిల్లా విద్యా శాఖ అధికారి శామ్యూల్‌ పాల్‌కు డీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యద ర్శులు వెంకట్రాముడు, గట్టు తిమ్మప్ప, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రత్నం ఏసేపు కలిసి శుక్రవారం వినతి పత్రం అందజేశారు.

మార్కులు, ర్యాంకులు ప్రకటించాలి: డీటీఎఫ్‌
డీఈవోకు వినతి పత్రం ఇస్తున్న డీటీఎఫ్‌ నాయకులు

కర్నూలు ఎడ్యుకేషన, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ- 2025లో ఎంపికైన అభ్యర్థుల మార్కులు, ర్యాంకులు ప్రకటించాలని జిల్లా విద్యా శాఖ అధికారి శామ్యూల్‌ పాల్‌కు డీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యద ర్శులు వెంకట్రాముడు, గట్టు తిమ్మప్ప, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రత్నం ఏసేపు కలిసి శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ డీఎస్సీ అభ్యర్థులందరికీ మార్కులు మాత్రమే ప్రక టించారని, దీని వలన పరీక్ష రాసిన అభ్యర్థులంతా గందగోళానికి గురవుతున్నారన్నారు. ఏ ర్యాంకు వరకు ఎవరికి ఏ కేటగిరిలో ఉద్యోగం వచ్చిందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఎంపికైన జాబితాను నోటీసు బోర్డులో పెట్టాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Aug 30 , 2025 | 01:03 AM