6న మారథాన్ పరుగు పోటీలు
ABN , Publish Date - Sep 02 , 2025 | 11:17 PM
జిల్లా ఎయిడ్స్ నియంత్రణ నివారణ విభాగం, జిల్లా క్రీడా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ ఉదయం 6 గంటలకు నగరంలో జిల్లా స్థాయి మారథాన్ 5 కిలోమీటర్ల పరుగు పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్ ఎల్.భాస్కర్ తెలిపారు.
ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్ ఎల్.భాస్కర్
కర్నూలు హాస్పిటల్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లా ఎయిడ్స్ నియంత్రణ నివారణ విభాగం, జిల్లా క్రీడా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ ఉదయం 6 గంటలకు నగరంలో జిల్లా స్థాయి మారథాన్ 5 కిలోమీటర్ల పరుగు పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్ ఎల్.భాస్కర్ తెలిపారు. మంగళవారం కర్నూలు నగరంలో స్టేడియంలో పరుగు పందెంకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ఈ పోటీల్లో పాల్గొనడానికి జిల్లా నివాసులై ఉండాలని, 17 నుంచి 25 సంవత్సరాల వయస్సు ఉన్న విద్యార్థులు, యువతీ యువకులు, పురుషులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు పాల్గొనవచ్చన్నారు. 6వతేదీ ఉదయం కోల్స్ కాలేజీ నుంచి పార్కు రోడ్డు, రాజ్‌విహార్, కర్నూలు మెడికల్ కాలేజీ, కలెక్టరేట్, సి.క్యాంపు మీదుగా నంద్యాల చెక్‌పోస్టు వరకు పరుగు పందెం ఉంటుందన్నారు. యువత, విద్యార్థులలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించేందుకు యూత్ ఫెస్ట్ కార్యక్రమంలో భాగం. 5 కిలోమీటర్ల పరుగు పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాశాఖ అధికారి భూపతిరావు, క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ అలిహైదర్ తెలిపారు. ఈపోటీల్లో గెలుపొందినవారికి బహుమతులు అందిస్తారన్నారు. జిల్లాలోని అన్నిప్రభుత్వ, ప్రైవేటు కాలేజీ నుంచి విద్యార్థులు, యువతీ యువకులు పాల్గొనాలని కోరారు.