మావోయిస్టుల హత్యలను ఆపాలి
ABN , Publish Date - Nov 24 , 2025 | 12:34 AM
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల హత్యలను ఆపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి రంగనాయుడు డిమాండ్ చేశారు.
బూటకపు ఎనకౌంటర్లకు నిరసనగా సీపీఐ ఆందోళన
డోన రూరల్, నవంబరు 23(ఆంధ్రజోతి): కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల హత్యలను ఆపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి రంగనాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు బూటకపు ఎనకౌంటర్లను నిరసిస్తూ డోన పాత బస్టాండు గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు నేతలను శాంతియుత చర్చలకు పిలిపించి మావోయిస్టు నేత సుగ్మాను, ఆయన భార్యతోపాటు 8 మందిని హత్య చేయించిన కేంద్ర ప్రభుత్వం బూట కపు ఎనకౌంటర్‌పై సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్ర మంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుంకయ్య, రాధాకృష్ణ, మండల కార్యదర్శి నారాయణ, అనుబంధ సంఘాల నాయకులు రామ్మోహన, పృథ్వి కుమార్, అబ్బాస్, మనోహర్ పాల్గొన్నారు.