Share News

పెళ్లి పత్రికలు ఇచ్చేందుకు వెళ్తూ..

ABN , Publish Date - Aug 07 , 2025 | 12:30 AM

పెళ్లి పత్రికలు ఇచ్చేందుకు వెళ్తూ ఓ వృద్ధుడు అనంతలోకాలకు చేరాడు. ఈ ఘటన మండలంలోని కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారి-40పై సోమయాజులపల్లె గ్రామానికి సమీపంలో గల బేతంచెర్ల యూటర్న్‌ వద్ద చోటుచేసుకున్నట్లు ఎస్‌ఐ సునీల్‌కుమార్‌ తెలిపారు.

పెళ్లి పత్రికలు ఇచ్చేందుకు వెళ్తూ..
వెంకటరమణ (ఫైల్‌)

అనంతలోకాలకు తండ్రి ఫ బైక్‌ను ఢీకొట్టిన మినీ బస్సు

ఓర్వకల్లు, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): పెళ్లి పత్రికలు ఇచ్చేందుకు వెళ్తూ ఓ వృద్ధుడు అనంతలోకాలకు చేరాడు. ఈ ఘటన మండలంలోని కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారి-40పై సోమయాజులపల్లె గ్రామానికి సమీపంలో గల బేతంచెర్ల యూటర్న్‌ వద్ద చోటుచేసుకున్నట్లు ఎస్‌ఐ సునీల్‌కుమార్‌ తెలిపారు. వివరాలు.. సోమయాజులపల్లెకి చెందిన వెంకట రమణ(65) తన కుమారుడు మధుబాబు పెళ్లి పత్రికలు ఇచ్చేందుకు బుధవారం చెన్నంచెట్టెపల్లె గ్రామానికి బైక్‌పై వెళ్తున్నాడు. గ్రామానికి సమీపంలో యూటర్న్‌ వద్ద దాటుతుండగా నంద్యాల నుంచి కర్నూలు వైపు వెళ్తున్న మినీ బస్సు ఢీకొనడంతో వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యుల ఘటనాస్థలికి చేరుకొని శోకసంద్రంలో మునిగి పోయారు. మృతుని కుమారుడు మధుబాబు వివాహం ఈనెల 13, 14 తేదీల్లో జరగాల్సి ఉంది. మృతుడికి ఐదు మంది కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Aug 07 , 2025 | 12:30 AM