వెండి రథంపై మల్లన్న
ABN , Publish Date - Aug 11 , 2025 | 11:31 PM
శ్రీశైలక్షేత్రంలో సోమవారం శ్రీశైల భ్రమరాంభ మల్లిఖార్జున స్వామి వార్లకు వైభవంగా ఊయల సేవ, వెండి రఽథోత్సవం నిర్వహించారు
నంద్యాల కల్చరల్, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): శ్రీశైలక్షేత్రంలో సోమవారం శ్రీశైల భ్రమరాంభ మల్లిఖార్జున స్వామి వార్లకు వైభవంగా ఊయల సేవ, వెండి రఽథోత్సవం నిర్వహించారు. శ్రీశైలక్షేత్రంలో లోక కల్యాణార్థం ఆలయ ప్రాంగణంలో ఆలయ వేదపండితులతో స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. శ్రీశైల క్షేత్రంలో పంచమఠాలైన ఘంటామఠం, భీమశంకర మఠం, విభూతి మఠం, రుద్రాక్ష మఠం, సారంగధర మఠం లోక కల్యాణం కోసం అర్చకులు పూజాదికాలు జరిపించారు. సాయంకాలం నిత్య కళారాధనలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సికింద్రాబాద్‌కు చెందిన నాట్య స్కూల్ ఆఫ్ కూచిపూడి బృందంతో సాంప్రదాయ నృత్యప్రదర్శన ఏర్పాటు చేశారు. కళల పరిరక్షణలో భాగంగా నిత్యకళారాధన కార్యక్రమంలో హరికఽథ, బుర్రకఽథ, సంప్రదాయనృత్యం, వాయుద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు నిర్వహించారు.