భక్తులతో కిటకిటలాడిన మల్లన్న క్షేత్రం
ABN , Publish Date - Aug 24 , 2025 | 12:26 AM
శ్రీశైల మల్లన్న క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది.
నంద్యాల కల్చరల్, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): శ్రీశైల మల్లన్న క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి తర్వాత స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో దర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల శివనామ స్మరణతో క్షేత్ర పరిసరాలు మార్మోగాయి. ఆలయ దర్శనాలు ప్రారంభమై ముగిసేంత వరకు భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. అలాగే తాగునీటి సౌకర్యం కల్పించారు.